SRH – HCA: హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంప్లిమెంటరీ పాస్‌లు కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియాన్ని వదిలిపెట్టే అవకాశం ఉందని కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి హెచ్‌సీఏకు ఒప్పందం ప్రకారం 10% ఉచిత టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది.…