ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వేములవాడలో పర్యటించనున్నారు. దేవాలయ అభివృద్ధికి రూ. 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వం శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ. 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.3కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ…