జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే తుది వీడ్కోలు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు. దీనికోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్మరణ సభకు అనేక ఏర్పాట్లు చేస్తూ, భారీగా ఖర్చు చేస్తోందని.. వీడ్కోలు కార్యక్రమం కోసం ఏకంగా 1.66 బిలియన్ల యెన్‌లను ఖర్చు చేస్తున్నారని అక్కడి మీడియా నివేదికలు తెలిపాయి.