ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనేది రాజ్యాంగ నిర్మాతల ఆలోచన అని 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అంశంపై ఏర్పాటైన కమిటీ ఛైర్మన్ రామ్‌నాథ్ కోవింద్ శనివారం అన్నారు. కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేశారు.
దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ఇటు అధికార పక్షమైన బీజేపీ తన ఎన్‌డీయే పక్షాలతోపాటు.. తన సొంత సొంత బలం పెంచుకోవడానికి కసరత్తు చేస్తోంది. ఈ సారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో దేశంలోని 28 పార్టీలు ఏకమై ఇండియా కూటమీగా ఏర్పడి ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించారు.