ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్త స్క్రిప్ట్ తయారుచేసుకుని సినిమా చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారాముల దర్శించుకున్న ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై ధ్వజం ఎత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని ఆయన విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఉద్యోగ నోటిఫికేషన్లు, రెండు పడక గదుల ఇల్లు, దళిత…