JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా పుట్లూరు మండల రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుట్లూరు మండలంలోని సుబ్బరాయ సాగర్ కి నీటిని విడుదల చేయాలని కోరారు.
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఇంకా స్పష్టత నెలకొనలేదు. దీంతో తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్నా సినిమాలపై భారం పడే అవకాశం ఉంది. అయితే ఈనెల 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ.. ఏపీలో జీవో 35 ప్రకారమే సినిమా టికెట్‌లు విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ సినిమాలపై కక్ష సాధింపులకు…