ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మొత్తం 28 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. విషయం తెలుసుకున్న అధికారులు కెజిబివి పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. గత రాత్రి తిన్న చికెన్ తోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. తరుచూ అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయం…