ఏపీలో పీఆర్సీపై నెలకొన్న సందిగ్ధత వీడలేదు. అమరావతిలోని సచివాలయంలో ముగిసింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. వచ్చే వారం ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ జరిగే అవకాశం వుంది. ఆ తర్వాతే ఫిట్ మెంట్, ఇతర ఆర్థిక అంశాల పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా వుంటేఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస రావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు సమావేశం అనంతరం మాట్లాడారు. మా 71 డిమాండ్ల పై అధికారులు…