Mumbai: మహారాష్ట్రలోని అలిబాగ్ సముద్ర తీరానికి సమీపంలో ఓ మత్స్యకారుల బోటుకు అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. ఈ బోటులో 18 నుండి 20 మంది మత్స్యకారులు ఉన్నారని సమాచారం. అయితే, అందులోని మత్స్యకారులందరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. నేడు ఉదయం అలిబాగ్ సమీప సముద్రంలో ఓ మత్స్యకారుల బోటుకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.…