విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం కొలిక్కిరాలేదు. కలెక్టరేట్‌లో జరిగిన ఇరు వర్గాల చర్చలు విఫలం కావడంతో పంచాయితీ మొదటికొచ్చింది. రాజీ కుదిర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రింగ్ వలల వివాదంపై విశాఖ కలెక్టరేట్‌లో ఆర్డీవో కిషోర్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల మత్స్యకారుల సమావేశం జరిగింది. జీవో ప్రకారం వేట కొనసాగిస్తే… తమకు ఉపాధి దక్కడం కష్టమవుతుందని రింగ్ వలల మత్స్యకారులు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం రింగు వలల మత్స్యకారులు వేటకు…