చేపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. చేపల్లో ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ D, విటమిన్ B2 (రైబోఫ్లావిన్), ఐరన్, జింక్, అయోడిన్, మ్యాగ్నీషియం, పొటాషియం వంటి అత్యవసర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు, మెదడు పనితీరును…