ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఎంత పటిష్టమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్.. ఓటముల్లో కూడా రికార్డులు నెలకొల్పుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఆ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోతూనే వస్తోంది. తాజాగా ఈ సీజన్ ఐపీఎల్‌లోనూ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. దీంతో…