జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో.. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దీంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నదికి భారీగా వరద పోటెత్తింది. తీరం వద్ద 12.300 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లను వరద ముంచెత్తింది. జాగ్రత్త పడ్డ అధికారులు భక్తుల పుణ్యస్నానాలను నిలిపివేశారు.