ఏపీలో పదవతరగతి పరీక్షాల ఫలితాల తీరుపై విపక్షం టీడీపీ మండిపడుతోంది. విమర్శలు, ట్వీట్లతో దుమారం రేగుతోంది. వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థని సర్వనాశనం చేసిందని, పదవ తరగతి ఫలితాల విషయంలో దశాబ్ద కాలంలో ఇంతటి వైఫల్యం లేదన్నారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. విద్యామంత్రి నైతిక బాధ్యత వహించకుండా తల్లితండ్రులపై నెట్టడం తప్పు. విద్యామంత్రి లేకపోవడంతో ఫలితాలు ఆపడం అన్యాయం. ఇతర రాష్ట్రాలు కోవిడ్అప్పుడు విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రయత్నించాయి.రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద…