యూకే పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. థింక్-ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు. బీజేపీ దేశంపై కిరోసిన్ చల్లిందని… ఒక్క నిప్పు రాజేస్తే సంక్షోభమే అని ఆయన విమర్శించారు. బీజేపీ సర్కార్ అన్నింటిని ప్రైవేట్ చేస్తోందని… ప్రైవేటు గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. మీడియాను కూడా నియంత్రించాలని భావిస్తున్నారని అన్నారు. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులను ఒకే కంపెనీ నియంత్రించాలనుకోవడం ప్రమాదకరం అని ఆయన అన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితి…