పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి వాదీ ఏ ముస్తఫా నగర్‌లోని పెళ్లిళ్లకు డెకరేషన్ చేసే గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక దళానికి వారికి సమాచారం చేరవేశారు.
Fire Breaks Out: హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉన్న దివాన్‌దేవిడి ప్రాంతంలోని మదీనా అబ్బాస్ టవర్స్‌లో తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం అర్ధరాత్రి దాటాక ఉదయం 2:15 గంటలకు జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నాలుగో అంతస్తులో ఉన్న 40కి పైగా బట్టల దుకాణాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మదీనా సర్కిల్ వద్ద…
హైదరాబాద్‌లోని అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత బొగ్గులకుంటలోని మయూర్ పాన్‌షాపు వద్దనున్న క్రాకర్స్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.