హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిషన్ బాగ్ కార్పోరేటర్, కాలాపత్తర్ ఇన్స్‌పెక్టర్, బహదూర్ పురా పోలీసులు వెంటనే స్పందించారు. కిషన్‌బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని ఓ బిల్డింగు సెల్లార్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అది కాస్త పైపునకు పాకింది. అగ్ని ప్రమాదం వల్ల భవనంపై అంతస్తు్ల్లోనూ దట్టమైన పొగ అలుముకుంది.