కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట్ లోని హోలిస్టిక్ హాస్పిటల్స్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల పొగతో ఆసుపత్రి ప్రాంతం కమ్ముకుపోయింది. ఈఘటనపై సమాచారం అందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆసుపత్రిలో 35 మందికి పైగా పేషెంట్స్ ఉన్నట్లు సమాచారం. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, రోగి కుటుంబీకులు,…