Speaker Ayyanna Patrudu: మరోసారి హాట్ కామెంట్లు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. పాసు పుస్తకాల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు, ఈ పాసు పుస్తకాలు శాశ్వతమైనవని, వీటి పంపిణీ రాజకీయాలకు అతీతంగా జరగాలని సూచించారు.…