ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న ఉద్యోగులకు నిరాశ ఎదురైనట్టు కనిపిస్తోంది.. మొత్తంగా ఈ ఏడాదిలో పీఆర్సీ ప్రకటన అనేది వట్టి మాటే అని తేలిపోయింది అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ మళ్లీ తిరోగమనం వైపు మళ్లిందని.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మళ్లీ ఉద్యమంలోకి వెళ్తాం అంటున్నారు.. పీఆర్సీపై కసరత్తులో భాగంగా.. ఇవాళ ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ఆర్ధిక శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు.. సచివాలయ ఉద్యోగుల సంఘం…
ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులపై గవర్నరుకు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల ఫిర్యాదు చేసారు. ఆర్ధిక శాఖ ఉన్నతాధికారుల పని తీరు దారుణంగా ఉందంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు పయ్యావుల. రూ. 40 వేల కోట్ల ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన రికార్డుల నిర్వహాణ సరిగా లేదంటూ పయ్యావుల సంచలన ఆరోపణ చేసారు. గత రెండేళ్లల్లో ఆర్ధిక శాఖలో జమా ఖర్చుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయని గవర్నరుకు దృష్టికి తీసుకెళ్లిన పయ్యావుల… రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో…