సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది. సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా హీరో వెంకటేష్ రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి. శ్యామల థియేటర్ వద్ద బాణాసంచా కాల్చి... హీరో వెంకటేష్ , దర్శకుడు అనిల్ రావిపూడి యూనిట్ సభ్యులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రేక్షకులతో హీరో వెంకటేష్ కొద్దిసేపు సందడి చేశారు. హీరో వెంకటేష్ తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత శిరీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.