Movie Piracy: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ పైరసీ రాయుళ్ల విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల పైరసీపై లోతైన దర్యాప్తు చేసి దేశంలోనే తొలిసారిగా ఒక పైరసీ ముఠాను పట్టుకున్నామని తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. పైరసీ కారణంగా సినీ పరిశ్రమ భారీగా నష్టపోతోందని సీపీ వివరించారు. 2023లో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు రూ.22,400…