తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ‘ఎస్క్వైర్ ఇండియా’ అనే ఒక మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంతేకాక ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ప్రచురించడంతో ఆయన అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఒక ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు తన కుటుంబానికి సంబంధించిన సినిమాల లెగసీ విషయంలో ఏం జరుగుతుందో తెలియదని, తాను ఆ విషయంలో ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదని చెప్పుకొచ్చాడు.…