EV Prices: ఢిల్లీలో 20వ FICCI ఉన్నత విద్యా సదస్సు 2025లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వెహికిల్స్ ధరకు సమానంగా మారతాయని తెలిపారు. మరో ఐదేళ్లలోపు, భారత్ లోని ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1గా మార్చడమే మా టార్గెట్ అన్నారు.