దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా తెలంగాణలో ఆర్టీసీకి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. పండగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు సోమవారం నాడు తిరుగుప్రయాణం అయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీ చేస్తుండటంతో ప్రజలు ఆర్టీసీనే నమ్ముకున్నారు. దీంతో ఈనెల 18వ తేదీ ఒక్కరోజే టీఎస్ఆర్టీసీకి రూ.14.79 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. సోమవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులు 36.3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. పండగల…