హైదరాబాద్ : మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని ప్రముఖ సినీ నటి ఇంద్రజ అన్నారు. సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిచడం అభినందనీయమని అన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని ఎన్ సి ఎల్ బిల్డింగ్ లో ఉన్న ఫర్టీ 9 సెంటర్ లో ప్రముఖ సినీ నటి ఇంద్రజ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో నిర్వహించనున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ప్రొసీజర్స్ ను లాంఛనంగా ప్రారంభించారు.…