ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తున్న ఫెర్రీ(ఓడ)లో మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు సముద్రంలోకి దూకారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓడ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఆకాశంలో నల్లటి పొగ ఎగసిపడుతోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 18 మంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన ఓడ పేరు KM బార్సిలోనా VA. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే..