మేడారం భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మేడారం జాతర వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈనెల 13 నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందిస్తామని తెలిపింది. ఈ మేరకు గత ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తులను హెలికాప్టర్ ద్వారా మేడారం తీసుకువెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్…