ధాన్యం కొనుగోలు సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం సేకరణపై మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయన్నారు. గతేడాది కన్నా 30శాతం అధికంగా ఈ సారి ధాన్యం సేకరించామని తెలిపారు. ధాన్యం సేకరించిన అనంతరం రైతులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లింపునకు ఎలాంటి నిధుల కొరత లేదన్నారు. opmsలో నమోదైన వెంటనే రైతులకు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.5,447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు.…
ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలయింది. న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు నష్టపోతున్నారన్నారు న్యాయవాది అభినవ్. దీనిపై విచారణ డిసెంబరు 6కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశం రాజకీయంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు గుండెపోటు బారిన పడుతున్నారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని హైకోర్టులో దాఖలైన పిల్‌లో…