మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, రేడియోల్లో రోజూ వినిపిస్తూనే ఉంటుంది. మందు బాటిళ్లపై కూడా మద్యం సేవించడం ప్రమాదకరం అని రాసి ఉంటుంది. కానీ ఎవరైనా వింటున్నారా? మన దేశంలో కష్టానికీ, మద్యానికీ విడదీయరాని బంధం ఉంది. రోజంతా కష్టపడే చాలా మంది సాయంత్రం కాగానే మద్యం బాటిల్ ఎత్తేస్తారు.