కొడుకు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అంటారు. కానీ ఆ కొడుకు.. ఆస్తి కోసం తండ్రిని దారుణంగా చంపేశాడు. సుత్తితో బలంగా మోది చంపేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. వృద్ధాప్యంలో తండ్రికి అండగా నిలవాల్సిన కొడుకే ఆ కన్న తండ్రి పట్ల కాలయముడయ్యాడు… ఆస్తి కోసం తండ్రినే హతమార్చాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో జరిగింది. గొట్లపల్లికి చెందిన హన్మంతు, నర్సమ్మ దంపతులకు ఐదుగురు కొడుకులు.…