Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై మరోసారి తెలంగాణ సంసృతీ, సంప్రదాయాలు తళుక్కున మెరిసాయి. ఇవాళ జరిగిన వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే షోలో పోటీదారులు అందరూ తెలంగాణకు ప్రత్యేకమైన పోచంపల్లి, గద్వాల్ చీరలు ధరించి ర్యాంపుపై వాక్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పోచంపల్లి హ్యాండ్లూమ్ వస్త్రాలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మెరిశారు. వందకు పైగా దేశాల ప్రతినిధులు చీరకట్టులో సంప్రదాయబద్దంగా కనిపించారు. అమెరికా కరె్బియన్ దేశాలకు చెందిన సుందరీమణులు…