కృష్ణా జలాల వివాదంలో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు రైతులు ఎంట్రీ ఇచ్చారు.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కృష్ణా జిల్లా రైతులు.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైకోర్టు.. జూన్ 28 తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 34ని సవాల్ చేవారు రైతులు.. జీవో 34 విడుదల చేసి విద్యుత్ ఉత్పత్తికి నీటిని అక్రమంగా తరలిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు..…