జల వివాదం.. విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జలాల వివాదంలో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు రైతులు ఎంట్రీ ఇచ్చారు.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కృష్ణా జిల్లా రైతులు.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైకోర్టు.. జూన్ 28 తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 34ని సవాల్ చేవారు రైతులు.. జీవో 34 విడుదల చేసి విద్యుత్ ఉత్పత్తికి నీటిని అక్రమంగా తరలిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.. వెంటనే జీవోను కొట్టివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. ఈ పిటిషన్‌పై జస్టిస్ రాంచందర్‌రావు బెంచ్ ముందు విచారణ జరిగింది.. అయితే, ఆ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేయాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కోరారు.. కానీ, జస్టిస్ రాంచందర్‌రావు బెంచ్ విచారించాలని తెలిపారు చీఫ్ జస్టిస్.. దీంతో.. పిటిషన్‌ను విచారించేందుకు రేఫ్యుజ్ చేయాలని కోరారు ఏజీ.. అసలు ఎందుకు విచారించవద్దో చెప్పాలని ఏజీని ప్రశ్నించారు జస్టిస్ రాంచందర్‌రావు.. ఆ తర్వాత జస్టిస్ రాంచందర్‌రావు బెంచ్ ఎదుట వాదనలు ప్రారంభం కాగా.. విచారణను రేపటికి వాయిదా వేశారు.
అంతర్రాష్ట్ర జల వివాదంపై సుప్రీంకోర్టుకు గానీ, హైకోర్టుకు గానీ.. విచారించే అధికారం లేదని.. ఈ విచారణ తమ పరిధిలో లేదని వ్యాఖ్యానించింది తెలంగాణ హైకోర్టు.. ట్రిబ్యునల్‌కు పూర్తి అధికారులు ఉన్నాయి కదా అని వాఖ్యానించింది.. సెక్షన్ 11.. అంతర్రాష్ట్ర జల వివాదం ప్రకారం ఈ పిటిషన్ అర్హతపై పిటిషనర్లను ప్రశ్నించింది హైకోర్టు.. సుప్రీంకోర్టు 2008లో జల వివాదాల పై ఇచ్చిన తీర్పును చదువుకుని రేపు రావాలని తెలుపుతూ.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tags
- Farmers petition
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!