ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహాపాదయాత్ర చేస్తున్నారు. 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర నవంబర్ 1 తేదిన ప్రారంభించారు. డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాల్లో ఇబ్బందులు పడుతూ పాదయాత్ర చేస్తున్న రైతులు ప్రకాశం జిల్లాకు చేరుకున్నారు. భారీ వర్షాలతో పాదయాత్ర…
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. 45 రోజుల పాటు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ ఈ మహాపాదయాత్రం సాగనుంది. అయితే నేడు 18వ రోజు ప్రకాశం జిల్లా గుడ్లూరులో మహాపాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం వద్ద నేటి పాదయాత్ర ముగియనుంది. 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో భారీ వర్షాలు…
పోలీసుల అండతో రైతులపై ప్రభుత్వం కక్షసాధిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్ ఘటనపై చినరాజప్ప స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎంత భయపెట్టినా రాజధాని రైతుల మహాపాదయాత్ర ఆగదని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతులు ఉన్నా ఖాకీలు ఆంక్షలెందుకు పెట్టారు..?…
ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. రైతుల మహా పాదయాత్ర చూసి సీఎం జగన్ భయపడుతున్నారని సెటైర్లు వేశారు. అందుకే రైతుల పాదయాత్రకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. రైతులు, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. రైతుల పాదయాత్ర…
జగన్ సర్కార్ ఆధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో అమరావతి అభివృద్ధికి భూములిచ్చి రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 45 రోజుల మహా పాదయాత్రకు రాజధాని రైతులు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర నవంబర్ 1 నుంచి ప్రారంభమైంది. నేడు రెండవ రోజు పాదయాత్రను ప్రారంభించనున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తాడికొండ నుండి గుంటూరు శివారు ప్రాంతం వరకు 12.6 కిలో మీటర్ల…