Kavitha: కరీంనగర్ జిల్లాలో కవిత మొదటి రోజు పర్యటన కొనసాగుతోంది. మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మొంథా తుపాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయటం లేదు. దానికి తోడు వర్షాల కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు.