18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ లో తొలి టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ తమ అభిమానుల కలను నెరవేర్చింది. ఆనందంతో ఊగిపోయిన బెంగళూరు నగరం, ఆగని సందడి, ఊహించని ఉత్సాహం మధ్య ఒక్కసారిగా అంతులేని విషాదాన్ని చవి చూసింది. ఈ విజయాన్ని తమ విజయంగా భావించిన అభిమానుల కలలు, ఆహ్లాదం, కళ్లలో కరిగిపోయిన ఆనందం... ఒక్కసారిగా కన్నీటి మడుగులో మునిగిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందడంతో…
ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాద ఘటనపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తొక్కిసలాటపై సీఎం విచారం వ్యక్తం చేశారు. 11 మంది చనిపోయినట్లు సీఎం స్పష్ట చేశారు. మరో 33 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో…