సుప్రసిద్ధ రచయత దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, ప్రముఖ చిత్రకారుడు సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) చెన్నయ్ లో గురువారం రాత్రి కన్నుమూశారు. సెప్టెంబరు 11, 1931లో జన్మించిన ఆయన తండ్రి చేయి పట్టుకుని సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు తప్పితే ఏ రోజునా పాఠశాలకు వెళ్ళి విద్యను అభ్యసించింది లేదు. సాంప్రదాయక చదువులు చదవకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. ఆయన తండ్రి వెన్నంటే ఉండేవారు. అలా ఉండడం వలన ఆ కాలం నాటి గొప్ప వ్యక్తులందరికి…