అనంతపురం జిల్లా ఉరవకొండ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంటుంది. రెండు రోజుల క్రితం ఉరవకొండ పట్టణంలో విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో జరిగిన ఘర్షణ కారణంగా ఈ గొడవ మరింత రాజుకుంది. వీరి కుటుంబంలో రెండు వర్గాలు ఉండగా గత ఎన్నికల్లో తన తండ్రి విశ్వేశ్వరరెడ్డి ఓటమికి విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి, మరో సోదరుడి కుమారుడు నిఖిల్ నాథ్ రెడ్డి కారణమని, ప్రత్యర్థి నాయకులతో కలిసి…