ఈ మధ్య కాలంలో డీప్‌ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీల ఫోటోలను మార్చేసి నెట్టింట రచ్చ చేస్తున్నారు. అసలు నిజమేంటో తెలియక జనం కూడా అది చూసి మోసపోతున్నారు. ఇప్పటికే చాలా మంది నటినటులు దీని బారిన పడగా.. తాజాగా ఇలాంటి ఫేక్ కంటెంట్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి నటుడు మాధవన్ ఇప్పుడు సీరియస్ అయ్యారు. తన పర్మిషన్ లేకుండా తన పేరును, ఫోటోలను వాడుకుంటూ కొన్ని వెబ్‌సైట్లు అశ్లీల కంటెంట్‌ను తయారు చేస్తున్నాయని మాధవన్ ఢిల్లీ హైకోర్టులో…