జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం చోటుచేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం. మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే.. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.