ఆఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు రూ.10 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయంపై రతన్ టాటా స్పందించారు. అదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఏ ఆటగాడికి సంబంధించిన సలహాలు లేదా ఫిర్యాదుల విషయంలో నేను ఐసీసీకి ఎలాంటి సలహా ఇవ్వలేదని రతన్ టాటా తన ట్వీట్‌లో రాశారు.
పార్టీ మారుతారు అనే ప్రచారంపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. నేను పార్టీ మారడం లేదు.. జరుగుతున్నది ప్రచారం మాత్రమే అందులో వాస్తవం లేదు.. ఏఐసీసీలో నాపై చర్చ జరిగినట్టుగా సమాచారం ఉంది.. కాంగ్రెస్ పార్టీ నేతలను నేను కలవ లేదు అని ఆయన తెలిపారు.
ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇబ్బందిగా మారిన సమస్య ఫేక్ న్యూస్ ప్రచారం. ముఖ్యంగా సెలబ్రెటీలు ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తరువాత వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం చాలా మంది తమకు నచ్చిన టైటిల్స్ ని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అసలు విషయం మరుగునపడిపోయి లేని వివాదంలో ఎంతో మంది చిక్కుకుంటున్నారు. తాజాగా ఇలానే తనకు సంబంధించి ఒక ఫేక్ వార్త రావడంపై హీరో కార్తికేయ ఘాటుగా…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సమీక్ష కోసం పార్లమెంట్‌కు స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదిత బిల్లు పంపబడింది.
గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , విజయశాంతి తదితరులు హాజరయ్యారు. గత కొంతకాలంగా టీ- బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Aaradhya Bachchan : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లపై చర్య తీసుకోవాలని కోర్టును కోరారు.
YouTube channels Ban: భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వంకు పైగా యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది. తాజాగా మరో 6 ఛానెళ్లపై సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ బ్యాన్ విధించింది. ఈ ఆరు ఛానెళ్లు సమన్వయంతో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నట్లు కేంద్ర గుర్తించింది. వీరటికి దాదాపుగా 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానెళ్ల పోస్ట్ చేసిన వీడియోలను…
Tirumala: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది వెళ్తుంటారు. ప్రతిరోజూ శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. సెలవు దినాల్లో అయితే ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. తిరుమలలో దర్శనం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ స్వామి ప్రసాదం స్వీకరించడం కూడా అంతే ముఖ్యం. అందుకే శ్రీవారి లడ్డూ తినాలని అందరూ పరితపిస్తుంటారు. దీంతో తిరుమల లడ్డూలకు తీవ్ర డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో తిరుమల లడ్డూలు బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో…
Vijayawada: దసరా పండగ సమయంలో ప్రత్యేక రైళ్లను నడపాల్సిన అధికారులు ఉన్న రైళ్లు రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కోసం విజయవాడ మీదుగా నడిచే వందలాది రైళ్లను రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కొన్ని రైళ్లను దారి మళ్లించారని.. విజయవాడ స్టేషన్‌కు వెళ్లకుండా రాయనపాడు, రామవరప్పాడు స్టేషన్‌లలో కొన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించారని ఓ మెసేజ్ తెగ సర్క్యులేట్ అవుతోంది. 9 9…