2022 ఏడాదికిగాను జగనన్న అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందులు కారణంగా రద్దు చేయడం జరుగుతుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ అన్నది అసలు మనుగడలోనే లేదు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేవిధంగా దుష్ర్పచారం చేసేవారు ఎంతటివారైనా ఉపేక్షించం, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో 2022 జగనన్న…
యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తున్న వాట్సాప్ మరో ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ సహాయంతో గ్రూప్ అడ్మిన్లుగా ఉన్న వ్యక్తులు గ్రూప్ సభ్యులు షేర్ చేసే మెసేజ్‌లను సులువుగా తొలగించవచ్చు. గ్రూప్‌లో ఎవరైనా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే గ్రూప్ అడ్మిన్ సదరు మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు. దీంతో గ్రూప్ సభ్యులకు అడ్మిన్ తమ మెసేజ్‌ను డిలీట్ చేసినట్లు చాట్ స్క్రీన్‌పై కనిపించనుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే…
మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ వార్తలు వచ్చాయి. దాన్ని ఆరోజే ఖండించాను. మాపై ఇలాంటివి రాసిన వారిపై పరువునష్టం దావా వేస్తా అని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం ఆలోచన ప్రకారమే పదవులు ఇస్తారు. మంత్రి పదవి కోసం ఎప్పుడూ నేను పాకులాడలేదు. ఆరోజు చెప్పగానే 24 మంది రాజీనామా చేశాం. మంత్రి పదవి లేనప్పుడు కొంచెం ఫీల్ అవటం ఎవరికైనా ఉంటుందన్నారు. అంతకుమించి ఇంకేమీ లేదు. నేను వైయస్సార్ ఫ్యామిలీ…
మరో వారం రోజుల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని జట్లు మైదానంలోకి అడుగుపెట్టి ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో ఇంకా బాధపడుతున్నాడని.. అతడు ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతోంది. గత ఏడాదితో భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ఫిట్‌గా లేడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే సన్‌రైజర్స్…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు.. తమిళ్ లోనే కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల అజిత్ నటించిన వలిమై అన్ని భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక గత కొద్దిరోజులుగా అజిత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. నిజం చెప్పాలంటే అజిత్ ఒక్కడి గురించే కాదు కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్, ధనుష్, విజయ్ లు కూడా రాజకీయ రంగప్రవేశం చేయనున్నారని వార్తలు వస్తున్న…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదోఒకటి ఫేక్ న్యూస్ తెగ రచ్చ చేస్తోంది.. అసలు ఏది వైరల్, ఏ రియల్ అని కనిపెట్టడమే కష్టంగా మారింది… అది ఫేక్ అని తెలిసేలోపే.. వైరల్‌గా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. అయితే, ఈ వ్యవహారంలో గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సంస్థలపై కేంద్ర సర్కార్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.. ఫేక్ న్యూస్ అరికట్టడంలో తగినన్ని చర్యలు చేపట్టక పోవడంలో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయితే, సామాజిక…
జాతీయస్థాయి రెజ్లర్ నిషా దహియా ఆమె సోదరుడు కాల్పుల్లో మృతిచెందినట్లు వార్తలు గుప్పుమన్నాయి. బుధవారం హరియాణా సోనిపట్‌లోని సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిషా దహియా ఆమె సోదరుడు సూరజ్ పై కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందినట్లు వార్తల సారాంశం. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఫేక్ న్యూస్ అని నిషా దహియా ట్విట్టర్ లో ఒక వీడియో ద్వారా తెలిపారు. ”…
గత రెండు రోజులుగా నెల్లూరు జిల్లాలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం మైపాడు బీచ్‌లో జలకన్య వలలో చిక్కినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక జలకన్య వలలో చిక్కినట్లు చూపిస్తూ ఆమె ఎలా ఉంటుందో చూపించారు. అయితే ఇదంతా నిజమేనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. ఆక్వా కోఆపరేటివ్ మార్కెట్ డైరెక్టర్ పామంజి నరసింహులు ఈ విషయమై స్పందించారు. బీచ్ లో జలకన్య వీడియో అంతా ఫేక్ అని, అలాంటి…
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని పుకార్లు రావడం సాధారణమే.. ఆ పుకార్లు మరింత తీవ్రమైతే తప్ప సెలబ్రిటీలు స్పందించరు. ఇంకొంతమంది పుకార్లపై స్పందిస్తూ ఫైర్ అవుతారు. ఇక తాజాగా దగ్గుబాటి రానా కొన్ని పుకార్లపై ఘాటుగానే స్పందించాడు. ప్రస్తుతం రానా విరాట పర్వం చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ చిత్రంపై ఒక న్యూస్ సైట్ ఒక వార్త రాసింది.…
కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో విస్తృతంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో.. సోషల్ మీడియా వేదికగా కొందరు ఫేక్‌గాళ్లు.. వ్యాక్సినేషన్‌పై తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు. ఇది నిజమా..? అబద్ధమా..? అని నిర్ధారణకు రాకుండానే.. చాలా మంది లైక్‌లు, షేర్లతో అది కాస్త వైరల్ చేస్తున్నారు. తాజాగా.. వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల (నవంబర్ 1వ తేదీ) నుంచి రేషన్, పింఛన్ నిలిపివేసే ఆలోచనలో వైద్యారోగ్య శాఖ ఉందంటూ..…