Twist in Mulakalacheruvu Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం తయారి కేసులో ట్విస్ట్ నెలకొంది. నిందితుడు జనార్దన్ వైసీపీకి చెందిన రాంమోహన్ గోడన్ ను అద్దెకు తీసుకోని మద్యం తయారీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తేలింది. గూడుపల్లికి చెందిన రాంమోహన్ వైసీపీలో యాక్టివ్ కార్యకర్త.. గతంలో అర్ కె డాబా పేరుతో హోటల్ నిర్వహించాడు. హైవే మార్పు చేయడంతో హోటల్ కు కష్టమర్లు రాకపోవడంతో మూసివేశాడు. జయచంద్రారెడ్డి సూచనతో అద్దెపల్లికి దాన్ని అద్దెకు ఇచ్చాడు.…
YS Jagan: అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీపై మాజీ సీఎం స్పందించారు. నకిలీ లిక్కర్ తయారీలో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చదిద్దాలని కంకణం కట్టుకున్నారా.? టీడీపీ నేతలు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీని పెట్టి సప్లై చేస్తున్నార అని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. నకిలీ మద్యానికి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు.