హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. అప్రమత్తమై ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేశారు. ఎక్కడా ఏమీ లభ్యం కాలేదు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని భద్రతా సిబ్బంది తేల్చింది. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా ధ్రువీకరించారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా ఎయిర్‌పోర్ట్ అధికారులు గుర్తించారు.…