Minister Seethakka : హైదరాబాద్ గాంధీ భవన్‌లో బుధవారం మంత్రి సీతక్క మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినడం, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు హాజరై తమ వినతులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రజల వినతులను స్వీకరించడంతో పాటు, కొన్నింటిని సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె…
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అందరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు.