స్నేహితులతో సరాదాగా కాసిన పందెం ప్రాణాల మీదకు తెచ్చింది. దీపావళి రాత్రి (అక్టోబర్ 31) బెట్టింగ్ ఛాలెంజ్‌లో భాగంగా శక్తివంతమైన బాణాసంచాపై కూర్చున్నాడు. ఒక్కసారి పేలడంతో ప్రాణాలు పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.