High Tension In Ramagiri: అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్త మృతి రాజకీయ వేడిని రాజేసింది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన గొడవలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించే ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈరోజు విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. పోలీసుల అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని, విచారణ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తున్నానని చెప్పారు. మరోసారి నోటీస్ ఇస్తే కూడా హాజరవుతానని స్పష్టంచేశారు. పోక్సో కేసుకు సంబంధించిన విషయంలో, బాధితురాలి పేర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సహా మరికొందరు రాజకీయ నేతలు ప్రస్తావించారు అన్నారు. ఈ అంశంపై తాను అధికారికంగా ఫిర్యాదు చేస్తానని, చట్టం అందరికీ సమానంగా ఉండాలని…