చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు సభలు పెడుతున్నారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాయలసీమలో కరవు కాటకాలు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు