అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ ఏపీకి సీఎం అయ్యింది చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించడానికే అని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. ఒకపక్క రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రజలు కొట్టుకుపోతుంటే మంత్రులకు ఏ మాత్రం పట్టడం లేదని ఆరోపించారు. చంద్రబాబు కంటతడి వైసీపీ నేతలకు శాపమని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసు విషయాలు బయటకు వస్తాయనే ఇలా తిట్టిస్తున్నారని.. ఇంకోసారి తమ నాయకుడి గురించి మాట్లాడితే…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం అంటూ హాట్ కామెంట్లు చేశారు పరిటాల సునీత.. మాలో ప్రవహించేది సీమ రక్తమే నన్న మాజీ మంత్రి.. నా భర్తను చంపినప్పుడు కూడా.. చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామన్నారు. ఇక, ఇప్పటికైనా చంద్రబాబు మీరు మారాలి అంటూ పరిటాల సునీత సూచించారు.. ఇన్నాళ్లూ ఓపిగ్గా ఉన్నాం.. ఇంకా ఓపికతో…